calender_icon.png 26 March, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమే..

26-03-2025 12:05:24 AM

ఆక్రమిత భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందే..

అంతర్జాతీయ వేదికపై పాక్‌కు భారత్ మరోసారి వార్నింగ్..

న్యూయార్క్: ‘జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ కశ్మీర్‌పై అనవసర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చట్టవిరుద్ధం. పదే పదే ఈ అంశాన్ని పాక్ ఎందుకు లేవనెత్తున్నది? అదంతా వృథా ప్రయాస. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంతోకాలం నడుపలేదు. ఇప్పటికే కశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది.

వెంటనే ఆ భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే. ఇకనైనా కుతంత్రాలు మానుకోవాలి’ అంటూ ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్‌లో తాజాగా శాంతిపరిరక్షణ సంస్కరణలపై జరిగిన సదస్సులో పాకిస్థాన్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ జమ్మూకశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.