18-04-2025 01:32:39 AM
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తిప్పికొట్టిన భారత్
లాహోర్, ఏప్రిల్ 17: కశ్మీర్ తమ జీవనా డి, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని మర్చిపోయే ప్రసక్తి లేదంటూ పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 1.3 మిలియన్ల మందిని కలిగిన భారత సైన్యమే భయపెట్టలేకపోయిందని, అలాంటిది ఉగ్రవాదులు తమను ఏం చేయగలరని ప్రశ్నిం చారు. హిందువులకన్నా తాము అన్ని విషయాల్లో భిన్నమని పూర్వీకులు నమ్మారని, ఆ నమ్మకమే రెండు దేశాల సిద్ధాంతానికి పునా ది వేసిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా బుధవారం ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్ జరిగింది.
పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ హాజరైన ఈ కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ ‘జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువులతో పోలిస్తే మనం భి న్నంగా ఉన్నామని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదా యాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. మనం ఒకే జాతి కాదు. అందుకే ఈ దేశాన్ని సృష్టించడానికి పూర్వీకులు చాలా కష్టపడ్డారు. పూర్వీకులతోపాటు ఈ దేశ నిర్మాణంలో మేము కూడా చాలా త్యాగా లు చేశాం. ఈ దేశాన్ని ఎలా రక్షించాలో మాకు తెలుసు. విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులే అని చెప్పారు.
ఉగ్రవాదులు మమ్మల్నేం చేస్తారు
ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్థాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలా మంది భయపడుతున్నారని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అన్నారు. ‘ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరని మీరు అనుకుంటున్నారా? 1.3 మిలియన్ల మందిని కలిగిన భారత సైన్యమే ఏం చేయలేకపోయింది. అలాంటిది ఉగ్రవాదులు పాక్ సైన్యాన్ని అణచివేస్తారని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.
బలూచిస్థాన్ వేర్పాటువాదులపై సాయుధ దళాలు కఠినంగా వ్యవవ హరిస్తాయని మునీర్ స్పష్టం చేశారు. బలుచిస్థాన్ పాకిస్థాన్‌కు గర్వకారణమన్న ఆయన.. ఇంకో పది తరాలు మారిన దాన్ని పాక్ నుంచి వేరుచేయలేరని స్పష్టం చేశారు. కశ్మీర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ తమ జీవనాడి అని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వీరోచిత పోరాటంలో కశ్మీర్ సోదరులను ఒంటరిగా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.
భారత్ కౌంటర్
కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం గట్టిగా బదులిచ్చింది. విదేశీ భూభాగం మీ జీవనాడి ఎలా అవుతుందని పాక్‌ను ప్రశ్నించడంతోపాటు కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధమని తేల్చిచెప్పింది.