calender_icon.png 7 January, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌కు రుషి కశ్యపుడి పేరు!

03-01-2025 01:21:31 AM

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్య

న్యూఢిల్లీ, జనవరి 2: కశ్మీర్‌కు రుషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ‘జమ్మకశ్మీర్ అండ్ లడక్ త్రో ది ఏజెస్’ పుస్తకావిష్కరణలో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. కశ్మీర్ కశ్యపుల భూమి అనే విషయం అందరికీ తెలుసనీ, కశ్మీర్‌కు కశ్యప్ పేరు పెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా షా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి జమ్ముకశ్మీర్ ఎంతో దోహదపడిందన్నారు. కశ్మీర్ సాంస్కృతిక వైభవానికి కృషి చేయనున్నట్టు వెల్లడించారు. ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌లో వేర్పాటు వాదానికి బీజాలు పడ్డాయన్నారు. ఆర్టికల్ రద్దు తర్వాత లోయలో ఉగ్రవాదం తగ్గిందని షా పేర్కొన్నారు.