02-03-2025 12:58:50 AM
నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు, 13 గిరిజన తండాల్లోని దాదాపు 4 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపి, శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. నేడు సర్వే పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాశీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాలతోపాటు మరో 13 గిరిజన తండాలకు 4 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని ఆయన తెలిపారు. కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.