calender_icon.png 7 February, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్ పై కాశీయాత్ర..

07-02-2025 07:29:12 PM

యాత్రికున్ని సన్మానించిన ఆర్యవైశ్యులు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): లోక కళ్యాణార్థం సైకిల్ పై కాశి యాత్రను చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన  వక్కలగడ్డ రామకృష్ణ తెలిపారు. కాశి ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక వివేకానంద చౌక్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 3న విజయవాడ నుంచి బయలు దేరానని, రోజుకు 120 కిలోమీటర్లు చొప్పున ప్రయాణిస్తూ 18 రోజుల్లో కాశీకి చేరుకొనేలా ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపారు.

గతంలో 35 సార్లు అయ్యప్ప మల ధరించానని, ఇందులో 15 సార్లు సైకిల్ మీద శబరిమల యాత్ర చేసినట్టు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు రామకృష్ణకు పూలమాలవేసి సన్మానించారు. కాశి యాత్రను సంపూర్ణంగా పూర్తిచేయాలని కోరారు. పట్టణంలోని స్థానిక సాయిబాబా మందిరంలో రాత్రి పడుకోవడానికి ఆశ్రయం కల్పించి అల్పాహారం ఏర్పాటు చేశారు. సన్మానించిన వారిలో ఆర్యవైశ్యులు చిలువేరి వెంకటేష్, గుండా ప్రమోద్, ఎక్కిరాల శ్రీనివాస్, పాత వెంకటేష్, విలాస్, ప్రశాంత్, చీల వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.