calender_icon.png 27 February, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల పక్షపాతి కాసాని ఐలయ్య

27-02-2025 12:00:00 AM

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం 

ఖమ్మం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : ప్రాణం పోయేంతవరకు ప్రజల కోసమే పోరాడిన కాసాని ఐలయ్య పేద ప్రజల పక్షపాతి అని సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సిపిఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో ఇటీవల మరణించిన సిపిఎం రాష్ర్ట నాయకుడు కాసాని ఐలయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని ప్రసంగిస్తూ రైతు కూలీల, కార్మికుల, వృత్తిదారుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలకు ఐలయ్య నాయకత్వం వహించాడన్నారు.

కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలలో పేదలకు ఇండ్ల స్థలాల కోసం అలుపెరగని పోరాటాలు చేశాడని, వేలాది మందికి ఇండ్ల స్థలాలు దక్కాయంటే ఆ ఘనత ఐలయ్యదేనని అన్నారు. పార్టీ రాష్ర్ట నాయకులు పోతినేని సుదర్శన్, యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, బండి పద్మ, యర్రా శ్రీనివాసరావు, మాదినేని రమేష్ పాల్గొన్నారు.