calender_icon.png 26 December, 2024 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశయ్య సేవలు మరువలేనివి

04-11-2024 02:17:53 AM

  1. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి 
  2. చేకూరి కాశయ్య విగ్రహాం ఆవిష్కరణ

ఖమ్మం, నవంబర్ 3 ( విజయక్రాంతి):  విద్యారంగ అభివృద్ధికి చేకూరి కాశయ్య చేసి న సేవలు మరువలేనివని ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలోని గురుదక్షిణ ఫౌండేషన్‌లో ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య, విద్యావే త్త ఎస్వీ నారాయణ విగ్రహాలను ఎంపీ ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా    మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి కాశయ్య చేసిన సేవను వివరించారు. ఫౌండేషన్‌లో డిజిటల్  లైబ్రరీ, కుట్టుశిక్షణ కేంద్రాలను  ప్రారంభించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, చంద్రశేఖర్,  హేమంతరావు   పాల్గొన్నారు.