calender_icon.png 22 January, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం రూ.496 కోట్లు

22-01-2025 02:09:50 AM

చెన్నై, జనవరి 21: ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ నికరలాభం 2024 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో 20.39 శాతం వృద్ధిచెంది రూ. 496 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో బ్యాంక్ రూ. 412 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ ఆదాయం రూ. 2,497 కోట్ల నుంచి రూ. 2,953 కోట్లకు చేరింది.

డిసెంబర్ చివరినాటికి స్థూల ఎన్‌పీఏలు 1.58 శాతం నుంచి 0.83 శాతానికి, నికర మొండి బకాయిలు 0.42 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గాయి.   డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో నికరలాభం 24.28 శాతం పెరిగి రూ. 1,149 కోట్ల నుంచి రూ. 1,428 కోట్లకు చేరినట్లు కరూర్ వైశ్యా బ్యాంక్  సీఈవో రమేష్ బాబు తెలిపారు.