calender_icon.png 4 April, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ఆర్టీసీ డిఎం గా కరుణశ్రీ

03-04-2025 05:35:56 PM

మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిసిన డిఎం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ గా కరుణ శ్రీ గురువారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కామారెడ్డి ఆర్టీసీ డిఎం గా పనిచేసిన ఇందిరా గత 15 రోజుల క్రితమే డిమోషన్ లో బస్సు భవన్ కు బదిలీ అయ్యారు. గతంలో పరిగి ఆర్టీసీ డిఎంగా పనిచేసిన కరుణ శ్రీ కామారెడ్డి ఆర్టీసీ డిఎంగా బదిలీపై వచ్చి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు అనుకూలంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులందరూ బస్సుల్లోకి ఆర్టీసీకి సహకరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా డిఎం అరుణశ్రీ కి ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది స్వాగతం పలికారు.