calender_icon.png 18 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత గూటికి కరుణాకర్‌రెడ్డి

18-01-2025 12:04:54 AM

200 మందితో బీఆర్‌ఎస్‌లో చేరిక

చేవెళ్ల, జనవరి 17 : చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీజేపీ నేత, ముడిమ్యాల గ్రామానికి చెందిన గోనె కరుణాకర్ రెడ్డి సొంత గూటికి చేరారు. శుక్రవారం 200 మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.

అనంతరం ముడిమ్యాల్ గేట్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు రైతుబందు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. 

ఎన్నికలకు ముందు ఆరుగ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారని, అందులో ఫ్రీ బస్సు తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు.  ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా సీఎం రేవంత్రెడ్డి  ఎవరూ గుర్తు పట్టడం లేదని, అలా గుర్తుపట్టలేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీలో చేరిన వారిలో గోనె నరేందర్రెడ్డి, గోనె రాంరెడ్డి, గోనె దినేశ్రెడ్డి, గోనె రాఘవేందర్రెడ్డి, గోనె రాల్రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బ్యాగరి శివకుమార్, ఊరడి జంగయ్య, ఎర్రవల్లి, ప్రభాకర్, ఇ.ప్రభాకర్, ఇ లక్ష్మయ్య, హెచ్.శేఖరప్ప, ఇ.రాములు, వై సుధాకర్, ఇ.జంగయ్య, యు.సూరి, కె.రమేశ్, ఎన్.రాములు, బేగరి సత్తయ్య, చాకలి శ్రీను, ఎస్.మహేందర్, జె.కృష్ణ  తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, మాజీ సర్పంచ్లు హన్మంత్రెడ్డి, సులోచనా అంజన్గౌడ్, సీనియర్ నాయకులు శేరి రాజు, షేక్ ఆరిఫ్ మియా, ఎస్.మహేందర్, బి.నందు,   వై.బాల్రాజ్ తదితరులు  పాల్గొన్నారు.