calender_icon.png 9 January, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు

04-01-2025 12:49:12 AM

విజయ్ హజారే ట్రోఫీ

విజయనగరం: భారత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హాజరే ట్రోఫీలో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కరుణ్ నాయర్ హ్యాట్రిక్ సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే వరుసగా రెండు శతకాలు బాదిన కరుణ్ నాయర్ శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌తో మ్యాచ్‌లో (101 బంతుల్లో 112) సెంచరీతో మెరిశాడు.

మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.  ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. లిస్ట్ క్రికెట్‌లో నాటౌట్‌గా నిలిచి అత్యధిక పరుగులు (542) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉంది. ఈ విజయంతో విదర్భ 20 పాయింట్లతో పట్టికలో టాప్ స్థానంలో నిలిచింది. మిగతా మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గర్, తమిళనాడు, ముంబై, బరోడా, కర్ణాటక విజయాలు సాధించాయి. గ్రూప్ హైదరాబాద్‌పై పంజాబ్ నెగ్గగా.. గ్రూప్ ఆంధ్రపై మహారాష్ట్ర గెలుపొందింది.