calender_icon.png 22 November, 2024 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక వన సమారాధన మన సంప్రదాయం

05-11-2024 12:34:41 AM

భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): కార్తీక మాసంలో పూజలు, వన భోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. సోమవారం వనస్థలిపుర ంలో కమ్మ కుల సమారాధన జరిగింది.

ఈ కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్‌తో పాటు బ్యాట్ ఉపాధ్యక్షుడు గంటా వెంకట్రావు, బ్యాట్ సహాయ కార్యదర్శి యూవీఎన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఉన్నవారే అధికంగా ఉన్నారని, అంతా ఐక్యమత్యం గా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని చెప్పారు.

సంస్కృతి, సంప్రదాయాలను హైంద వ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కార్తీక మాసంలో జరుపుకొనే వన సమారాధన కార్యక్రమం అని తెలిపారు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే సందేశా న్ని మన సమారాధన ఇస్తుందన్నారు.