గజ్వేల్, నవంబర్ 3: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలోని శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగా రం. కార్తీక మాస మొదటి ఆదివారా న్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. 87 మంది దంపతుల జంటలు ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. సాయంత్రం అర్చకులు, ఆలయ సిబ్బంది దీపోత్సవం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో దీపాలను వెలింగించారు.