కృష్ణానదిలో పుణ్యస్నానాలు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం అశేష భక్తజనం శ్రీశైల పుణ్యక్షేత్రానికి బారులు తీరారు. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేసి భక్తులు తమ మొక్కలు తీర్చుకొని దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ గోపురానికి ఎదురుగా దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి వచ్చి చేరడంతో శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కొల్లాపూర్ మండలం సోమశిల నది తీరం వద్ద కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి శివయ్యకు మొక్కులు జరిపారు.