- తెల్లవారుజామున దీపాలు వెలిగించిన మహిళలు
- కృష్ణా, గోదావరి తీరాల్లో భక్తుల పుణ్యస్నానం
విజయక్రాంతి నెట్వర్క్, నవంబర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు భక్తులకు కిటకిటలాడాయి. మహిళలు తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి కార్తీక దీపాలు వెలిగించారు. మొక్కలు చెల్లించుకుని నైవేద్యం సమర్పించారు.
కామారెడ్డి జిల్లా కోటగిరి మండలంలోని కందకూర్తి త్రివేణి సంగమం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలోని గోదావరి, అలంపూర్ జోగుళాంబ ఆలయ సమీపంలోని తుంగభద్ర, వాడపల్లి సంగమ క్షేత్రం కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లకు తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు.