calender_icon.png 27 December, 2024 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలకు కార్తీక శోభ

03-11-2024 01:30:27 AM

యాదాద్రిభువనగిరి, నవంబర్ 2 (విజయక్రాంతి): ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పవిత్ర కార్తీక మాసం ఆరంభం రోజు శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు.

భక్తుల తాకిడి నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం అందించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా స్వామివారి విమాన గోపుర బంగారు తాపడానికి సికింద్రాబాద్ మారేడ్‌పల్లికి చెందిన వెలుగుపల్లి వామనరావు, సునీత దంపతులు.. ఉప్పల్‌కు చెందిన మేడిశెట్టి మాణిక్ ప్రభు, స్రవంతి దంపతులు చెరో లక్ష రూపాయలు విరాళం అందజేశారు.

నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో..

గజ్వేల్, నవంబర్ 2: కార్తీకమాసం ప్రారం భం కావడంతో సిద్దిపేట జిల్లా వర్గల్ మం డలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం లో శనివారం స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి గరుడసేవ, నిత్యకల్యాణం, నిజాభిషేకములు నిర్వహించారు. క్షేత్రంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. గజ్వేల్ తదితర ప్రాంతాల్లోని శివ, కేశవ ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు.