calender_icon.png 18 November, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలకు కార్తీకశోభ

18-11-2024 04:00:50 AM

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించిన దంపతులు

కొమురవెళ్లికి పోటెత్తిన భక్తులు

గజ్వేల్/కొమురవెళ్లి/జగదేవ్‌పూర్, నవంబర్17: సిద్దిపేట జిల్లాలోని పుణ్యక్షేత్రాలన్నీ కార్తీకమాస మూడో ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో 156 జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకోగా స్వామివారికి 7జంటలు నిజాభిషేకాలు, 4జంటలు నిత్యకల్యాణం నిర్వహించారు.

రాత్రి నాచగిరి క్షేత్రంలో దేవాదాయశాఖ తరుఫున ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లన్న ఆలయం ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్నస్వామిని దర్శించుకుని గంగరేగు చెట్టుకింద పట్నం వేసి బోనం సమర్పించారు.

కొమురవెళ్లి మల్లన్న చెల్లెలుగా ప్రసిద్ధి చెందిన కొండపోచమ్మను కూడా భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుని కుటుంబసమేతంగా విందులు జరుపుకున్నారు.