ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్తీకమాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మహిళలు లక్ష్మీపూజలు చేశారు. ఇంటి పరిసరాల్లో దీపాలతో అలంకరించారు. అనంతరం చిన్నారులు, యువత బాణసంచా కాల్చారు. రకరకాల బత్తీలను పేల్చి సంబురాలు జరుపుకున్నారు. మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కోదండ రామాలయం, బోడు గ్రామంలోని గణపతి సహిత శివాలయంతో పాటు పలు ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు ఆలయ పూజారుల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.