బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ టు గ్రౌండ్ లో ఈనెల 11న ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పనులను శనివారం మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్తీకదీపోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్, నాయకులు మునిమంద రమేష్, దెబ్బటి రమేష్ భూపెల్లి రాజేశ్వర్, జక్కుల శ్రీధర్, చిట్యాల మధులు పాల్గొన్నారు.