గజ్వేల్/చేర్యాల, నవంబర్24: వారాంతపు సెలవు కావడంతో సిద్దిపేట జిల్లా నాచగిరి శ్రీ లక్ష్మినరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సామూ హిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడంతో పాటు దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో సాయంత్రం నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి గంటకు పైగా సమయం పట్టింది. ముఖమండపం, గంగరేణు చెట్టు వద్ద పట్నం వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.