calender_icon.png 21 November, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీకం.. ఆధ్యాత్మికం

11-11-2024 09:40:02 PM

అలంపూర్,(విజయక్రాంతి): ప్రముఖ శైవ క్షేత్రం ఐదో శక్తి పీఠమైన జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జోగులంబ అమ్మవారి ఆలయాలకు చేరుకొని సమీపంలోని తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి, స్వామివార్లకు కుంకుమ అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం రాత్రి  తుంగభద్ర నదిమ తల్లికి ఆలయ అర్చకులు , హారతి ఇచ్చారు.