నెలరోజులుగా నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం ఆదివారం ముగిసింది. చివరిరోజు ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళలు దీపాలను వినాయకుడి ఆకారంలో ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోపోత్స వాలకు సహకరించిన అందరికీ ఈవో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్, పాండు, అర్చకులు పాల్గొన్నారు.
గజ్వేల్, డిసెంబర్ 1