calender_icon.png 23 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక్.. ఓ బ్యాడ్ బాయ్!

23-01-2025 01:14:41 AM

హీరో నాగశౌర్య ఇప్పుడు ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. రామ్ దేశిన (రమేశ్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. బుధవారం నాగశౌర్య పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ టైటిల్ నాగశౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్‌ను సూచిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వ్యాన్ వెనుక కూర్చుని ఇంటెన్స్ లుక్‌తో ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారాయన.  వ్యాన్‌పై ఉన్న స్టిక్కర్‌పై రాసి ఉన్న ‘Hyderabad’ అనే పేరులో ‘BAD’ అనే పదం తొలగించి ఉండటాన్ని బట్టి అతని పాత్ర దూకుడు స్వభావాన్ని, యాక్షన్-ప్యాక్డ్ స్టుల్‌ను సూచిస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇంకా సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: రసూల్ ఎల్లోర్; సంగీతం: హారిస్ జైరాజ్; పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్; ఆర్ట్: రామాంజనేయులు; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; ఫైట్స్-: సుప్రీమ్ సుందర్, పృథ్వీ.