25-03-2025 05:38:00 PM
చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మద్ది కార్తీక్, గౌరవ అధ్యక్షుడిగా మల్లేశం, ఉపాధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా నిరంజన్, సంయుక్త కార్యదర్శిగా రాజేష్, కోశాధికారిగా లక్ష్మణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మద్ది కార్తిక్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడానికి, సహచర న్యాయవాదుల సూచనలు సలహాలు పాటిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎన్నికైన సభ్యులను డాక్యుమెంట్ రైటర్ కొలిపాక సంతోష్ కుమార్ తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.