calender_icon.png 23 January, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరు మెంటార్‌గా కార్తీక్

02-07-2024 12:05:00 AM

బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. ‘మా వికెట్ కీపర్‌కు ఘన స్వాగతం. ఇక నుంచి ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా.. మెంటార్‌గా కార్తీక్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. క్రికెట్ నుంచి అతడిని దూరం చేయొచ్చేమో! కానీ క్రికెట్ అతడికి దూరం కాదు. జట్టులో కార్తిక్ 12వ ఆటగాడు’ అని పోస్టు చేసింది. దీనిపై కార్తిక్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టేందుకు ఉత్సుకతతో ఉన్నా. మెంటార్‌గా జట్టును నడిపించేందుకు సిద్ధం’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్‌లాడిన దినేశ్ కార్తిక్ 4, 842 పరుగులు సాధించాడు.