18-04-2025 12:24:30 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: ఎండోమెంట్ భూమి పరాధీనం కావడానికి దేవాదాయ శాఖ అధికారులు అక్రమార్కుల కు పూర్తి స్థాయిలో సహకరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు వ్యవహరిస్తున్న తీరు దానికి బలం చేకూరుస్తోంది. గండిపేట మండలం మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కపురి కాలనీలో రోడ్ నెంబర్ 16 లో ఉన్న 800 గజాల తుల్జా రామ్ బాగ్ ఆలయం స్థలాన్ని ఓ వ్యక్తి ద ర్జాగా కబ్జా చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు.
తప్పుడు సర్వే నె ంబర్ సృష్టించి స్థలాన్ని కాజేసినట్లు ఎండోమెంట్ అధికారులే వెల్లడించారు. సర్వే నెంబర్ 112, 116, 125 లో ఎండోమెంట్ భూమి ఉంది. సర్వే నెంబర్ 117లో ఉన్న కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారు. అంతేకాకుండా తమకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని దేవాదాయ శాఖకు చెందిన భూమిని కబ్జా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఇటీవల సంబంధిత శాఖ అధికారులు ఈఓ అరుణ కుమారి, ఇన్స్పెక్టర్ మెహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మోహన్ రెడ్డి తదితరులు కబ్జా చేసిన స్థలం వద్దకు వెళ్లి తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. పనులను కూడా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ తరువాత ఏం జరిగిందో ఏమో అధికారులు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. స్వాధీనం చేసుకున్న స్థలం గురించి పట్టించుకోవడం, పర్యవేక్షించడం తమ పని కాదనుకున్నారో ఏమో మరి.. తిరిగి ఎండోమెంట్ స్థలం అక్రమార్కుల చెర లోకి వెళ్ళిపోయింది. రాత్రి సమయాల్లో తిరిగి దర్జాగా పనులు చేస్తున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు.
లెటర్ ఎందుకు ఇవ్వడం లేదు..?
దేవాదాయ శాఖ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి భారీ స్థాయి లో భవంతి నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి తమకు పర్మిషన్ రద్దు చేయా లని లెటర్ అందజేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఆ విధంగా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
సదరు స్థలంలో నిర్మాణానికి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని లెటర్ ఇవ్వకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయశాఖ కమిషనర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కలగజేసుకుని 12 కోట్లు విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపల్ కు లెటర్ రాస్తాం
దేవాదాయ శాఖ స్థలంలో చేపట్టిన నిర్మాణానికి సంబంధించి ఇంటి పర్మిషన్ రద్దు చేయాలని మణికొండ మున్సిపల్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ శాఖకు వెంటనే లెటర్ రాస్తామని దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు.