యాదగిరిగుట్ట, జనవరి ౪: యాదగిరిగుట్ట బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పాదాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు.
అనంతరం కేక్ కట్ చేశారు. మల్లాపురంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వెంకటయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.