calender_icon.png 25 January, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు వర్గాల ఆత్మబంధువు కర్పూర్ ఠాకూర్

24-01-2025 08:18:45 PM

సామాజిక విప్లవాలకు ఆధ్యులు కర్పూర ఠాకూర్...

మునుగోడు (విజయక్రాంతి): దేశంలో బహుజన రాజ్యాధికారం కోసం అహర్నిశలు పోరాటం చేసి సాధించి చూపెట్టిన బహుజన వీరుడు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కర్పూర ఠాకూర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి స్థానిక బీసీ నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిసి వర్గాలకు ఆశాజ్యోతి ఎన్నో సంస్కరణలకు పునాదులు వేసిన మహానీయుడు అని, బలహీన వర్గాలకు ఆరాధ్యులుగా నిలసి దేశ చరిత్ర పుటల్లో మిగిలిపోయారని అన్నారు. బిఆర్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన గొప్ప నాయకుడు కర్పూర ఠాకూర్ అని కొనియాడారు.

బ్రిటిష్ కాలంలోనే ఉద్యమాలు నడిపి బీహార్ రాష్ట్రంలో సామాజిక అసమానతలుపై నిరంతరం పోరాటం చేసి మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కాలని రాజ్యాధికారం చేజిక్కించుకొని బడుగు బలహీన వర్గాలకు అందరికీ విద్యా హక్కు కల్పించడం మద్యపాన నిషేధం, మాతృభాషలో విద్యా, బీసీ వర్గాలకు జరగాల్సినటువంటి న్యాయాన్ని తన అధికారంలో చేసి చూపించారని డిఆర్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన గనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాజిక న్యాయం కోసం బీసీలకు రాజకీయ అధికారం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మునుగోడు మండల అధ్యక్షులు గుంటూరు వెంకటాచారి, మలిగ యాదయ్య, గురుజ నరసింహ గౌడ్, జాజుల వెంకటేష్, దేవలోకం రిషికేష్ మాధగోని మల్లయ్య, నరసింహనాయి, బై రోజు నరసింహ చారి, జే వి గౌడ్ పాల్గొన్నారు.