22-04-2025 12:27:12 AM
తలలో బుల్లెట్.. చేతిలో తుపాకీ గుర్తింపు
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర కర్ణి సేన అధ్యక్షుడు వినయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలలో బుల్లెట్ దిగడంతో పాటు ఆయన మృతదేహం పక్కనే తుపాకీ గుర్తించారు. వినయ్ సింగ్ కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా జంషెడ్‌పూర్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. సంఘటనా స్థలికి వెళ్లగానే వినయ్ సింగ్ మృతదేహం కనిపించింది. ఆయన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డుకుని కాల్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరైనా కాల్చి చంపారా? లేక అతనే ఆత్మహత్యకు చేసుకున్నారా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.