calender_icon.png 15 January, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకదే టైటిల్

14-09-2024 02:44:33 AM

జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్

మంగళూరు: 77వ సీనియర్ జాతీ య అక్వాటిక్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను మరోసారి కర్ణాటకనే సొంతం చేసుకుంది. శుక్రవారంతో ముగిసిన పోటీల్లో  పురుషుల 4 x 100 ఫ్రీస్టుల్ ఈవెంట్‌లో కర్ణాటకకు చెందిన బృందం పసిడి గెల్చుకుని కొత్త రికార్డు సృష్టించింది. కర్ణాట కకు మొత్తం 17 స్వర్ణాలు, 12 రజతాలు, 4 కాంస్య పతకాలు దక్కాయి. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో బెంగాల్‌కు చెందిన సౌబ్రితి స్వర్ణం సాధించింది. ఇక చివరి రోజు తెలంగాణ నుంచి వ్రితి అగర్వాల్ 200 మీటర్ల ఫ్రీస్టుల్ కేటగిరీలో కాంస్యం నెగ్గగా.. పురుషుల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో వర్షిత్ దులిపూడి కాంస్యం దక్కించుకున్నాడు.