అహ్మదాబాద్: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పం జాబ్ 247 పరుగులకు ఆలౌటైంది. అన్మోల్‌ప్రీత్ (51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (127 బంతుల్లో 139 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు.
ఇక గ్రూప్-బిలో మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్లతో గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గర్‌పై విదర్భ, ఉత్తర్ ప్రదేశ్‌పై తమిళనాడు, సిక్కింపై ఆంధ్ర, జార్ఖండ్‌పై హర్యానా విజయాలు నమోదు చేసుకున్నాయి.