calender_icon.png 15 April, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపిస్ట్ ఎన్‌కౌంటర్

13-04-2025 11:21:43 PM

ఐదేండ్ల చిన్నారిని రేప్ చేసిన నిందితుడు

బెంగళూరు: ఐదేండ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసిన కసాయిని కర్ణాటక పోలీసులు ఆదివారం ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. బీహార్‌కు చెందిన నితేశ్ కుమార్ (35) ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఆ చిన్నారి కోసం ఎంత గాలించినా కనిపించలేదు. కొద్ది సేపటికి ఓ భవనంలోని బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి.. నితేశ్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడు ఆ చిన్నారి మీద లైంగిక దాడికి యత్నించాడని ఆరోపణలు ఉన్నా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. నిందితుడిని పట్టుకుని గుర్తింపుఉ ధ్రువీకరించుకనేందుకు తరలిస్తుండగా.. కాల్పులు జరిపాడు. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని మట్టుబెట్టారు. హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ‘నిందితుడి మీద రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఒక బుల్లెట్ అతడి కాలులోకి, మరో బుల్లెట్ వెనకాలకు చొచ్చుకుపోయింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు.