విజయ్ హజారే ట్రోఫీ
వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో నాలుగుసార్లు చాంపియన్ కర్ణాటకతో పాటు మహారాష్ట్ర సెమీస్‌లో అడుగు పెట్టింది. శనివారం జరిగిన తొలి క్వారర్స్‌లో మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.
ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (107) సెంచరీతో అలరించాడు. అనంతరం పంజాబ్ 44.4 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. అన్మోల్‌ప్రీత్ (48) టాప్ స్కోరర్. ముకేశ్ 3 వికెట్లు తీశా డు. బరోడాతో జరిగిన మరో క్వారర్స్‌లో కర్ణాటక ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.
తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్ పడిక్కల్ (102) సెం చరీ సాధించాడు. అనంతరం బరోడా 49.5 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో గుజరాత్ తో హర్యా నా, విదర్భతో రాజస్థాన్ ఆడనున్నాయి.