calender_icon.png 16 January, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో కర్ణాటక

15-01-2025 11:50:24 PM

విజయ్ హజారే ట్రోఫీ

వడోదర: దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం హర్యానాతో జరిగిన సెమీఫైనల్లో కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (48),  హిమాన్షు రానా (44) పర్వాలేదనిపించారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి 4 వికెట్లతో రాణించగా.. ప్రసిధ్, శ్రేయస్ గోపాల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన కర్ణాటక జట్టు 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసి గెలుపొందింది. ఇన్‌ఫామ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (86), స్మరణ్ రవిచంద్రన్ (76) అర్థసెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. హర్యానా బౌలర్లలో నిషాంత్ సింధూ 2 వికెట్లు తీశాడు. కాగా కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. నేడు జరగనున్న రెండో సెమీస్‌లో విదర్భ, మహారాష్ట్ర తలపడనున్నాయి.