calender_icon.png 29 March, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపన్న ఎమ్మెల్యేలు కర్ణాటకలోనే ఎక్కువ

22-03-2025 12:20:10 AM

  1. రెండో స్థానంలో ఏపీ
  2. టాప్ 10లో ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్
  3. ఏడీఆర్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో మ హారాష్ట్ర ఉంది. ఈ విషయం అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

దేశ వ్యాప్తంగా 119 మంది అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీని ప్రకారం కర్ణాటక అసెంబ్లీలో 31 మంది అత్యంత ధనవంతమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అ లాగే ఏపీ శాసనసభలో 27 మంది, మహారాష్ట్రలో 18 మంది ఎ మ్మెల్యే లు అత్యంత సంపన్నులు.

అలాగే దే శంలో టాప్ 10 అత్యంత సంపన్న ఎ మ్మెల్యేల జాబితాలో ఒక్క క్క రాష్ట్రం నుంచి నలుగురు చొప్పున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు చో టు దక్కిం ది. ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు.

ఈ జాబితాలో ముంబైలోని తూర్పు ఘట్కోపర్ ని యోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎ న్నికైన బీజే పీ ఎమ్మెల్యే పరాగ్ షా తొలిస్థానం లో ఉండగా, కర్ణాటక డి ప్యూటీ సీఎం శివకుమార్ 1,413కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీ ఎమ్మెల్యే లు సగటున రూ.65కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే కర్ణాటక ఎమ్మెల్యేలు సగటున రూ.63.5కోట్ల ఆస్తు లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడం గమనార్హం.