calender_icon.png 16 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకతో పవన్ చర్చలు సఫలం.. ఏపీకి 8 కుంకి ఏనుగులు

08-08-2024 06:12:07 PM

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ- కర్నాటక మధ్య ఎల్లప్పుడూ ససుహృద్భావ వాతావరణం ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 2 రాష్ట్రాలు కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయని పవన్ పేర్కొన్నారు. కర్నాటక- ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉందని వెల్లడించారు. ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్నాటక సహకారం ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. 8 కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్నాటక ఒప్పుకోవడం సంతోషం అన్నారు.

ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా కర్నాటక అధికారులు పట్టుకున్నారు. ఎర్ర చందంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అటవీసంపద రక్షణకు సాంకేతికత వినియోగించుకోవటంపై చర్చించామన్నారు. ఉపగ్రహ ఆధారిత నిఘాపెట్టే అవకాశాలను తీసుకువస్తామన్నారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేయాలని నిర్ణయించామని పవన్ స్పష్టం చేశారు. వన్య ప్రాణులను స్మిగ్లింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు వచ్చే కర్నాటక భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తామని పవన్ కళ్యాన్ హామీ ఇచ్చారు. ఎకో టూరిజం అభివృద్ధికి రెండు రాష్ట్రాలు పటిష్టమైన కార్యాచరణ చేపడుతున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.