పోలీసుల ఎదుట చివరి మావోయిస్టు లొంగుబాటు
బెంగళూరు, ఫిబ్రవరి 2: కర్ణాటక లో చివరి మావోయిస్టుగా భావిస్తున్న లక్ష్మీ పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరైండరై ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయా న్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం నక్సలైట్ అజెండాతో పని చేయ డం ప్రారంభించారు. ఇదిలా ఉంటే కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రం గా మారిందని ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఇటీవల ప్రకటించిన విష యం తెలిసిందే.