calender_icon.png 25 October, 2024 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణుడి పాత్ర పాజిటివ్‌గానే ఉంటుంది

06-07-2024 03:07:46 AM

ప్రపంచం దృష్టిని మరోమారు భారతీయ సినిమా వైపు మళ్లించింది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి2898ఏడీ’ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారీ చిత్రాన్ని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని కల్కి సెట్‌లో మీడియాతో ముచ్చటించారు. ఆ          విశేషాలు ఆయన మాటల్లోనే... 

“ఈ విజయం మా టీమ్ అందరిది. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్‌తోపాటు భావి దర్శకులకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇలాంటి సైన్స్ ఫిక్చన్ కథలు రాసుకునే ఆవరికి ‘కల్కి’ రిఫరెన్స్  పాయింట్‌లా ఉంటుంది. తెలుగు సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చేది ‘మాయాబజార్’. అది మహాభారతానికి ఒక అడాప్టేషన్. అదొక క్రియేటివ్ ఫిక్చన్. అక్కడి నుంచే నేను స్ఫూర్తి పొందాను. ముందు ఒక్క సినిమాగానే ఈ కథను తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను ఒక్క భాగంలో చెప్పడం చాలెంజింగ్ అనిపించింది. అప్పుడే పార్టులు గా చూపించాలని నిర్ణయించుకున్నా. పార్ట్ సంబంధించి 20 రోజుల షూట్ చేశాం. ఇంకా చాలా చేయాలి. యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్.. ఇలా చాలా ఉన్నాయి... అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలి.

కథ, పాత్రలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అమితాబ్, కమల్, ప్రభాస్, దీపికా లాంటి పెద్ద నటులను తీసుకున్నాం. తొలి భాగంలో వరల్డ్ బిల్డింగ్ అయిపోయింది. పాత్రల గురించి ప్రేక్షకులకు తెలిసింది. ఇకపై ఇంకా వినోదాత్మకంగా ఉం టుంది. కర్ణుడి పాత్ర పాజిటివ్‌గానే ఉంటుంది. ఒక సినిమాను నాలుగున్నరేళ్ల దాకా పట్టుకొని ఉండాలం టే జడ్జిమెంట్ ఉండాలి. 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జిమెంట్ పెట్టుకోవటమనేది కష్టమైన విష యం. దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి.

ఈ సినిమా విషయంలో ఇది కష్టమనిపించింది. భవిష్యత్తులో సంపూర్ణంగా రామాయణం తీయాలన్న ఆలోచన ఇప్పటికైతే లేదు. వైజయంతీ మూవీస్‌లో పనిచేసిన అందరూ దాదాపు ఈ సినిమాలో కనిపించారని, నాని, నవీన్ పొలిశెట్టి మాత్రమే కనిపించలేదని అడుగుతున్నారు.. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్లను పెట్టేస్తాను. కమల్ గారి పాత్రతో శ్రీశ్రీ కవిత్వం చెప్పించడానికి కారణం.. యాస్కిన్ ఫిలాసఫీకి సరిపోయే లైన్స్ అందుకే అలా చేశాం. వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల చరిత్రలోనే ఇది అద్భుతమైన సినిమా.

ఈ కథ చెప్పినప్పు డు ప్రభాస్ చాలా ఉత్తేజానికి గురయ్యా రు. ప్రాజెక్టును బాగా నమ్మారు. ఆరంభం నుంచి ప్రోత్సహించారు. రాజమౌళి, ఆర్జీవీ ఇండస్ట్రీని చేంజ్ చేసిన డైరెక్టర్లు. అందుకే నటించేందుకు వారిని ఒప్పించా. ఆర్జీవీ గారు ‘నేను ఎందు కు?’ అని అడిగారు. ‘కలియుగంలో మీరు ఉంటారు’ అని చెప్పాను. అశ్వినీదత్ గారికి తప్పితే మరొకరికి సినిమా చేయకూడదనేమీ కాదు.. కుదరటం లేదంతే. ఒక్కో సినిమా నాలుగైదేళ్లు పడుతోంది! బుజ్జిని డిజైన్ చేయడానికి ఏకంగా ఆటోమొబైల్ ఇంజినీరింగే చేశాం. పేటెంట్ హక్కులు తీసుకున్నాం. టెంపరరీ లైసెన్స్ కూడా ఇచ్చారు” అని వివరించారు నాగ్ అశ్విన్. ‘కల్కిగా ఏ హీరో రాబోతున్నారు?.. ఇందులో మీ ఫేవరేట్ క్యారెక్టర్ ఏది’ అన్న చివరి ప్రశ్నకు ‘ఇంకా పొట్టలోనే ఉన్నాడు కదా.. ఇంకా దానికి సమయం ఉంది. నా ఫేవరేట్ కర్ణుడు’ అని సమాధానమిచ్చారు.