calender_icon.png 4 February, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కర్మస్థలం’ నా హృదయానికి ఎంతో దగ్గరైంది: హీరోయిన్ అర్చన

03-02-2025 11:33:56 PM

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మస్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మిథాలీ చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేశ్, దిల్ రమేశ్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీకి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు.

కానీ నిర్మాత శ్రీనివాస్ సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది’  అన్నారు. దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. నిర్మాత శ్రీనివాస్ నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు’ అని చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా, దిల్ రమేశ్, బలగం సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.