టాటా స్టీల్ చెస్ టోర్నీ
కోల్‌కతా: నార్వే సూపర్‌స్టార్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ డబుల్ బొనాంజ సాధించాడు. కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ విజేతగా కార్ల్‌సన్ నిలిచాడు. ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలిచిన కార్ల్‌సన్ తాజాగా ఆదివారం మరో రౌండ్ మిగిలి ఉండగానే బ్లిట్జ్‌లోనూ విజయం సాధించాడు.
శనివారం తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చేతిలో ఓటమి చవిచూసినప్పటికీ కార్ల్‌సన్ ఆదివారం ఫైనల్ పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీపై తన నంబర్‌వన్ ఆటను ప్రదర్శించాడు. బ్లిట్జ్‌లో మూడు విజయాలతో 13 పాయింట్లు సాధించిన కార్ల్‌సన్ బ్లిట్జ్ క్రౌన్ గెలుచుకున్నాడు. 2019లోనూ కార్ల్‌సన్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో డబుల్ టైటిల్స్‌తో అదరగొట్టడం విశేషం.
భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేసి (10.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలవగా.. ప్రజ్ఞానంద (9.5 పాయింట్లు), విదిత్ గుజరాతీ (9 పాయింట్లు) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వంతిక అగర్వాల్ (9.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది.