calender_icon.png 15 March, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ కళ్యాణానికి మార్క్సిజమే మార్గం...

14-03-2025 07:07:45 PM

సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి

సిపిఐ ఎం ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ 142వ వర్ధంతి సభ

భద్రాచలం,(విజయక్రాంతి): సమస్త మానవాళికి మార్క్స్ రాసిన గ్రంథమే మార్గదర్శమని మానవ కళ్యాణానికి మార్క్సిజమే మార్గమని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్ బి నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం సిపిఐఎం భద్రాచలం పట్టణం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్లు మార్క్స్ 142వ వర్ధంతి సభలో ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా రానున్న ఆర్థిక సంక్షోభానికి మార్స్ గ్రంథమే ప్రత్యన్యాయం అని నర్సారెడ్డి స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్దాలకు సామ్రాజవాదాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను సమీకరించి పోరాటాలను నిర్మించడమే మార్క్స్ ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ వర్ధంతి సభకు సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బండారు శరత్ బాబు అధ్యక్షత వహించగా పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట్రామారావు డి సీత లక్ష్మి సంతోష్ కుమార్ పట్టణ కమిటీ సభ్యులు చాట్ల శ్రీనివాసరావు కుంజా శ్రీనివాస్ సండ్ర భూపేంద్ర కోరాడ శ్రీనివాసరావు రవి డి రామకృష్ణ ముత్తయ్య తదితరులు పాల్గొని మాకు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు