calender_icon.png 16 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలతో నీట మునిగిన కరివిరాల ప్రాథమిక పాఠశాల

31-08-2024 02:55:14 PM

అధికారుల స్పందించి స్కూలు బయట వర్షం నీరు పోయేటట్టు డ్రైనేజీ ఏర్పాటు చేయాలి.

తుంగతుర్తి, విజయక్రాంతి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శనివారం ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం వల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల చెరువుని భారీ వర్షం వల్ల నీట పాఠశాల మునిగింది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా పాఠశాలలోకి నీరు చేరి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో విద్యార్థులను లోపలికి గదుల్లో కూర్చోబెట్టి పాటాలు చెప్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి కరివిరాల ప్రాథమిక పాఠశాలలో మీరు నిలవకుండా నూతన డ్రైనేజీని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.