calender_icon.png 26 October, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తా

15-07-2024 12:08:32 AM

  1. అధిక నిధులు తెచ్చి అద్దంలా తీర్చిదిద్దుతా
  2. అభివృద్ధిలో మార్క్ చూపిస్తా
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

కరీంనగర్, జూలై 14 (విజయక్రాంతి): కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి.. అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత తనదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. జన్మనిచ్చి తనను ఇంతవాడిని చేసిన కరీంనగర్‌ను అభివృద్ధి చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనిచేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ సిటీ మిషన్ పొడ గింపు సందర్భంగా నగర మేయర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు ఆదివారం బండి సంజయ్‌ని కరీంనగర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి సంద ర్భం వస్తుందని, అందరూ కలిసి సన్మానిస్తారని ఊహించలేదన్నారు.

ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్‌కు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించిందని, ఇకపై ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ల సహకారంతో తన మార్క్ ఏమిటో చూపిస్తానని, తనకు జన్మనిచ్చిన ఈ గడ్డ కోసం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అమృత్1 కింద రూ.132 కోట్లు వచ్చాయని, అందులో కేవలం కేంద్రం వాటా రూ.66 కోట్ల నిధులవల్లే నిరంతరం నీళ్లు ఇవ్వగలుగుతున్నామన్నారు. ఈ మధ్య అమృత్ కింద మరో రూ.147 కోట్లు మంజూరైతే కేంద్రం తన వాటా కింద రూ.73.5 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం రూ.934 కోట్లు మంజూరైతే అందులో రూ.765 కోట్లు ఇప్పటికే వచ్చాయని, ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందన్నారు. కాగా, తాను బతికినంతకాలం ఒకే పార్టీ.. ఒకే సిద్ధాంతంతో పనిచేస్తూ ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని, అందుకోసం ఎందాకైనా పోరాడతానని తెలిపారు. కాపువాడకు వచ్చిన సంజయ్‌ని మున్నూరుకాపు సంఘం ఆవరణలో ఘనంగా సన్మానించారు. 

హరీశ్‌రావు మంచి నాయకుడే కానీ..

మాజీ మంత్రి హరీశ్‌రావు మంచి పొలిటీషియన్ అని, ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం, హరీశ్‌రావు బీజేపీలో చేరతానే ప్రచారంపై అడిగిన ప్రశ్నకు సంజయ్ ఈ విధంగా స్పందించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ లు ఆడుతున్న కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్త్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింసను ఎవరూ మర్చిపోలేదన్నారు. అటువంటిది బీఆర్‌ఎస్ తో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు.