calender_icon.png 25 November, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభ్యత్వ నమోదులో కరీంనగర్ టాప్

25-11-2024 01:41:35 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, నవంబరు 24 (విజయక్రాంతి): బీజేపీ సభ్యత్వ నమోదులో కరీం నగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు బండి సంజయ్‌ను కలిశా రు. జిల్లా అధ్యక్షుడు చేతులమీదుగా బండి సంజయ్ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నా రు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో 7 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేయడం విశేషమన్నారు. కార్యకర్తలకు హాట్సాప్ చెబుతు న్నానని, వాళ్ల కృషి ఫలితంగానే సభ్యత్వ నమోదులో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు. ఇదిలా ఉండగా శరత్ సాహితీ కళ స్రవంతి ఆధ్వర్యంలో జనవరి 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న రజతోత్సవాల బ్రోచర్‌ను బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.