19-02-2025 01:48:32 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి18: కరీంనగర్‌కు చెందిన 12 సంవత్సరాల మనిష్ రావు జ్ఞాప కశక్తిలో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాథ మెటిక్స్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ రెండు వంద ల వరకు జ్ఞప్తికి ఉంచుకొని కంఠత చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రముఖ మెమరీకో మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డా.వేణు కుమార్ మాట్లాడుతూ, 2025 సంవత్సరానికి గణిత శాస్త్రం ప్రకారం ఎం తో ప్రాముఖ్యత ఉందని.. 2025 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ (45 x45 =2025) మరియు ఒకటి (1) నుంచి తొమ్మిది(9) గల సంఖ్యల అన్నింటినీ కలిపితే వాటి మొత్తం 2025 అవుతుంది.
కాబట్టి ఈ 2025వ సంవత్స రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును తెలియజే స్తూ 200 వరకు గల అన్ని అంకెల స్క్వేర్స్ మరియు క్యూబ్స్ కంఠత చెప్పి ఇంటర్నే షనల్ రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలి పారు. మనీష్ స్థానిక వివేకానంద సీబీఎస్ ఈ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నా రు. ప్రెస్ భవన్ లో నిర్వహించిన కార్యక్ర మంలో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్స్ ను ప్రధానోత్సవం చేయ డం జరిగింది.
ఈ ప్రపంచ రికార్డు తో పా టు నేషనల్ సూపర్ మెమరీ చాంప్ టైటిల్ ని కూడా దక్కించుకున్నట్లు డా.వేణు కుమా ర్ తెలిపారు. తమ తనయుడు ఇంత గొప్ప విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులు శ్రీనివాస్ రాధ ఆనందం వ్యక్తం చేశారు. తమ బాలుడికి మ్యాథ్స్ లో ఉన్న ఆసక్తిని గుర్తించి చేంజ్ మెమరీ అకాడమీలో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. తమ పుత్రుడు ఇం త మంచి ప్రజ్ఞను చూపి ప్రపంచ రికార్డు సా ధించటం తమకెంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. చేంజ్ మెమరీ అకాడమీ ట్రేెనర్స్ తిరుపతి, హరీష్ కుమార్, అఖిల్ తమ విద్యార్థి సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.