25-04-2025 12:13:18 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నూతన పర్సనల్ ఆఫీసర్ గా జి. సత్యనారాయణ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతములో ఖమ్మం రీజయన్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం సత్యనారాయణ కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి. రాజును, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్. భూపతిరెడ్డిని మర్యా ద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీక రించిన జి సత్యనారాయణ కు పర్సనల్ ఆఫీసర్ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ బి. సత్తయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది సుజాత, వై.ఎల్. నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.