20-03-2025 12:02:25 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి19 (విజయక్రాంతి): కరీంనగర్ నూతన పోలీస్ కమీషనర్ గా భాధ్యతలు తీసుకున్న గౌస్ ఆలం బుధవారంనాడు కరీంనగర్ జైలును సందర్శించారు. జైలు సెక్యూరిటీని పరిశీలించారు. జైలులో ఉన్న పరిశ్రమలను, అందులో ఉత్పత్తి అవుతున్న స్టీల్ ఫర్నిచర్, అగరుబత్తిల తయారీ కేంద్రం, ఫినాయిల్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ జి . విజయ డేని,జిల్లా జైలు మెడికల్ అధికారి వేణుగోపాల్, జైలర్ బి రమేష్ డిప్యూటీ జైలర్లు శ్రీనివాస రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేష్, అజయ్ చారి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.