కరీంనగర్: పాడి రైతుల నుండి పాలను సేకరించి స్వచ్ఛమైన నాణ్యతతో కూడిన పాలను అందిస్తున్న ప్రియ మిల్క్ ను ఆదరించాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానికులను కోరారు. కంపెనీ చైర్మన్ రామ్మోహన్ రావు, కార్పొరేటర్ బొనాల శ్రీకాంత్ తో కలసి బుధవారం రాంనగర్ లో ప్రియా మిల్క్ పార్లర్ ను ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ప్రజలు, రైతులు ముందుకు రావాలని యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన పాలు, పెరుగుతో పాటు పాల పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నారని, గెద్దె, ఆవు నెయ్యిని కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామగిరి ప్రమోద్ రావు, పిచర నరేందర్ రావు, సంస్థ మేనేజర్ చింతపల్లి నర్సింగరావు పాల్గొన్నారు.