calender_icon.png 30 October, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడివేడిగా కరీంనగర్ పాలక సంస్థ సమావేశం

14-08-2024 02:00:57 AM

  1. సమస్యలపై నిలదీసిన సభ్యులు
  2. అన్ని డివిజన్లు సమానమేనన్న మేయర్

కరీంనగర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా కొనసాగింది. మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీజేపీకి చెందిన 55వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ మాట్లాడుతూ.. చెత్త ట్రాక్టర్ల మరమ్మతులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిప డ్డారు. ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటుకు తీర్మా నం చేయాలన్నారు. సీఎం హామీల నిధులకు సంబంధించిన పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంపై పలువురు సభ్యులు నిలదీశారు. కొత్తగా కేటాయించిన నిధుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అందుకు నిధులు మంజూరు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.

పాలకవర్గ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చి ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. సమవేశంలో 80 ఎజెండా అంశాలు, 180 టేబుల్ ఎజెండా అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మేయర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికులపై భారం పడకుండా యంత్రాలతో పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమవేశంలో కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అసిస్టెం ట్ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ యాదగిరి, ఇన్‌చార్జి ఏసీపీ వేణు పాల్గొన్నారు.