calender_icon.png 19 April, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్లో కరీంనగర్ కు గుండు సున్న

21-03-2025 01:40:12 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, మార్చి 20 (విజయ క్రాంతి): రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు గుండు నున్న మిగిలిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి బడ్జెట్లో కరీంనగర్ కు పెద్దపీట వేసి నిధులు తీసుకువచ్చామన్నారు. సీఎం అస్యూరెన్స్ కింద 350 కోట్లు తీసుకువచ్చామన్నారు.

మానేరు రివర్ ఫ్రంట్‌కు 644 కోట్లు బడ్జెట్లో నిధులు తీసుకువచ్చామ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కరీంనగర్ కుఎలాంటి నిధులు లేవని, బీఆర్‌ఎస్ హయంలో మొదలుపెట్టిన పనులు కూడా ఆగిపోయాయన్నారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణలో భాగం కాదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కానందునే వివక్షతతో నిధులు మంజూరు చేయడం లేదని, పనులు కొనసాగించడం లేదన్నారు.

ఇప్పటికైనా మంత్రులు పట్టించుకొని కరీంనగర్‌కు నిధులు తీసుకువచ్చి ఆగిపోయిన పనులను కొనసాగించాలని, కొత్త పనులకు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మాకు రావా ల్సిన వాటా ప్రకారం నీటిని విడుదల చేయాలని, మా వాటా ప్రకారం  నీరు విడుదల చేయ కుంటే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ సభ్యులు ఉన్నారా అని ప్రశ్నించారు.

బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు. ఎన్‌ఎండీలో 8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మార్చి నెలాఖరులోగా నగర ప్రజలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదన్నారు. మంత్రులు పట్టించుకొని కరీంనగర్ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. 

అభివృద్ధి బాటలో నడుస్తున్న కరీంనగర్ ను మబ్బు పటిస్టున్నారని అన్నారు.  చిత్తశుద్ధితో పనిచేయాలని, బడ్జెట్లో కరీంనగర్ కు నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్ రాజేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.